rade cheli namma rade cheli lyrics

| |


రాదే చెలి నమ్మ రాదే చెలి

మగవరినిలా నమ్మరాదే చెలి

 

రాదె చెలి నమ్మ రాదే చెలి

మగనాలీ మనస్సమ్మ రాదే చెలి

రాదే చెలి నమ్మ రాదే చెలి

 

 

నాడు పట్టు చీర కట్టుకుంటె బరువన్నాడే

నేడు నూలు చీరకే డబ్బులు కరువన్నాడే

నెలతప్పిన నెలత తనకు బరువన్నడె

నేడు నెలబాలుడు చెతికిస్తే తనకు బరువన్నడే

ముంగురులను చూస్తే చాలు మురిసిపొయ్యాడే

కురులకు వెల ఇవ్వడమే మరచిపొయ్యాడే

ప్రెమించు సీసన్ లొ పెద్ద మాటలు

పెళ్ళయ్యాక ప్లేటు ఫిరాయింపులు

 

రాదే చెలి నమ్మ రాదే చెలి..........

 

 

మాటల్తొ కొట కట్టాడే

అమ్మో!!!!

నా మహరాణి నీవన్నాడే

కాలు కింద పెడితేనే కందిపొవునన్నడే

గాలి తాకితే మన పాలు విరుగునన్నాడే

కవ్వించుకున్నడే కౌగిలి కొసం

కాస్త తీరాక మొదటికి మోసం

మనవి వినడు మనసు కనడు మాయల మొగుడు

 

రాదే చెలి నమ్మ రాదే చెలి...................

 

తలలో నాలుకలా

పూసలలొ దారంబు మార్కి

సతి మది లొ నన్నెలంగెడు పురుషుడు కలుగుటా

పది జన్మలు నోము ఫలము

తోయజ నేత్ర

తనుగా వలచిన వరుడేనా పురుషొత్తముడు

వ్రతములు గలిపిన సతులకు గతి కలదా

ఇలలో కలదా

లేదా

 

 

No comments:

Post a Comment